'కార్తికేయ 2' విషయంలో నిర్మాతల నిర్ణయం

03-02-2020 Mon 12:46
  • గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
  • సీక్వెల్ దిశగా సన్నాహాలు 
  • ఆలోచనలో పడిన చందూ మొండేటి
నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి కొంతకాలం క్రితం తెరకెక్కించిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. స్వాతి కథానాయికగా నటించిన ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి నిఖిల్ - చందూ మొండేటి రంగంలోకి దిగారు. ఈ సినిమాకి ఏషియన్ సునీల్ నిర్మాతగా వ్యవహరించవలసి వుంది. అయితే కథాపరంగా బడ్జెట్ .. నిఖిల్ మార్కెట్ ను మించిపోతుండటంతో వాళ్లు వెనకడుగు వేశారట.

దాంతో ఈ సినిమాను నిర్మించడానికి పీపుల్ మీడియావారు ముందుకు వచ్చారు. 13 కోట్లలోనే ఈ సినిమాను నిర్మించాలనే నిర్ణయానికి వాళ్లు వచ్చినట్టుగా సమాచారం. అయితే అంతమొత్తంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలనా? లేదా? అనే సందేహంతో చందూ వున్నాడని అంటున్నారు. నిఖిల్ కూడా ఇదే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాడని చెబుతున్నారు. నిర్మాతలు మాత్రం తాము చెప్పిన బడ్జెట్ కి కట్టుబడి ఉన్నారట. ఈ విషయంలో నిఖిల్ - చందూ మొండేటి ఏం నిర్ణయించుకుంటారో చూడాలి మరి.