Corona Virus: కేరళలో మరొకరిలో కరోనా వైరస్‌ గుర్తింపు : మూడుకు చేరిన బాధితుల సంఖ్య!

  • ఇప్పటికే ఇద్దరిలో గుర్తింపు
  • ఒకరు వైద్య విద్యార్థి...మరొకరు చైనా సందర్శకుడు
  • ముగ్గురికీ ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్న వైద్యులు
కేరళలో కరోనా బారిన మరొకరు పడ్డారని గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరినట్టయిది. చైనాలో వైద్య విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థి భారత్‌కు రాగా, అతనికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. చైనా పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చిన వ్యక్తికి కూడా వైరస్‌ సోకిందని రెండు రోజుల క్రితం గుర్తించారు.

తాజాగా మూడో వ్యక్తికి సోకిన విషయం బయటపడింది. దీంతో కేరళ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. కేరళ సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని మంగళూరు, కొడగు, చామరాజ్‌నగర్‌, మైసూరు ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాపించి ఉందన్న అనుమానంతో 29 మంది నుంచి వైద్యులు రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. దీంతో ఆ రాష్ట్ర అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. మరోవైపు మాల్దీవ్స్‌, చైనా నుంచి తమ దేశానికి ఎవరూ రాకుండా నిషేధం విధించింది.
Corona Virus
kerala
third case

More Telugu News