Vijayashanti: మళ్లీ సందర్భం వస్తుందో? రాదో? ఇప్పటికిక సెలవు: విజయశాంతి

  • ప్రజా జీవన పోరాటంలోనే నా ప్రయాణం
  • నా అభిమాన సైన్యానికి నమస్సులు
  • ఆదరించిన అందరికీ ధన్యవాదాలు
తన సినీ ప్రయాణం గురించి విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవన పోరాటంలోనే తన ప్రయాణం కొనసాగుతుందని ఆమె తెలిపారు. మరో సినిమా చేసే సమయం, సందర్భం తనకు వస్తుందో, రాదో తనకు తెలియదని చెప్పారు. ఇప్పటికిక సెలవు అని చెప్పారు. మీ ఆదరణకు, తన ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అని అన్నారు. 'సరిలేరు నీకెవ్వరు' వంటి గొప్ప విజయాన్ని నాకు అందించి, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న అభిమానులకు ధన్యవాదాలు అని చెప్పారు. 1979లో 'కళ్లుకుల్ ఇరమ్' సినిమా నుంచి ఇప్పటి 'సరిలేరు నీకెవ్వరు' వరకు తనను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు అని అన్నారు. ఈమేరకు ఆమె వరుస ట్వీట్లు చేశారు.
Vijayashanti
Tollywood

More Telugu News