sudha narayanmurthy: సామాన్యురాలిలా సంతలో పూలు, కూరగాయలు కొన్న సుధా నారాయణమూర్తి

  • షోర్పాలిలోని తమ ఇలవేల్పును దర్శించుకున్న సుధా నారాయణమూర్తి
  • బంధువుల ఇంట్లో బస చేసి వారాంతపు సందర్శన
  • కృష్ణా నది వరద బాధితులకు పరామర్శ
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి సామాన్యురాలిగా మారిపోయారు. చేతిలో సంచితో సంతకు వెళ్లి కూరగాయలు, పూలు కొన్నారు. ఆమెను గుర్తించిన కొందరు ఆశ్చర్యపోయారు. కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని షోర్పాలిలో  కొలువైన తమ ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా నివసించే బంధువుల ఇంట్లో బసచేశారు. అనంతరం వారాంతపు సంతను సందర్శించి పూలు, కూరగాయలు కొన్నారు. ఈ సందర్భంగా కృష్ణానది వరదల్లో సర్వం కోల్పోయిన వ్యాపారులను సుధా నారాయణమూర్తి పరామర్శించారు.
sudha narayanmurthy
Infosys
Karnataka

More Telugu News