Hero Motocorp: బీఎస్-6 ప్రమాణాలతో కొత్త స్కూటర్ తీసుకువచ్చిన హీరో

  • మార్కెట్లోకి సరికొత్త ప్లెజర్ ప్లస్ స్కూటర్  
  • ప్రారంభ ధర రూ.54,800
  • 10 శాతం అదనపు మైలేజీ ఇస్తుందంటున్న కంపెనీ

భారత అగ్రశ్రేణి ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ బీఎస్-6 ప్రమాణాలతో కొత్త స్కూటర్ ను తీసుకువచ్చింది. సరికొత్త రూపంతో ప్లెజర్ ప్లస్ 110 ఎఫ్ఐను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.54,800 (ఎక్స్ షోరూం) కాగా, అల్లాయ్ వీల్స్ తో కావాలంటే రూ.56,800 (ఎక్స్ షోరూం) చెల్లించాల్సి ఉంటుంది. కాగా బీఎస్-4 మోడల్ తో పోల్చితే బీఎస్-6 మోడల్ కు రూ.6300 ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది.

తాజా మోడల్ కు రెట్రో లుక్ తో మరింత సొబగులు అద్దారు. క్రోమ్ హెడ్ ల్యాంప్, ఆకర్షణీయమైన సీటింగ్, పొందికైన రూపం దీని ప్రత్యేకతలు. బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించడమొక్కటే తప్ప ఇంజిన్ శక్తిలో ఎలాంటి మార్పులేదు. అయితే, బీఎస్-4 మోడల్ తో పోల్చితే తాజా మోడల్ 10 శాతం అదనపు మైలేజీ ఇస్తుందని హీరో మోటోకార్ప్ చెబుతోంది.

More Telugu News