YSRCP: ఇది ప్రభుత్వ దాడి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఈ ప్రభుత్వానిదే బాధ్యత: వర్ల రామయ్య

  • నారావారి పల్లెలో వైసీపీ సభపై అభ్యంతరాలు
  • వైసీపీ సభకు పోలీసులు ఎలా అనుమతి ఇస్తారని వర్ల ప్రశ్న
  • గ్రామస్థులు నిరసన విరమించాలని కోరుతోన్న పోలీసులు

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గం నారావారి పల్లెలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. వైసీపీ సభ, టీడీపీ నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఈ విషయంపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఈ ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.

నారావారి పల్లెలో వైసీపీ సభను ప్రభుత్వ దాడిగా తాము భావిస్తున్నామని వర్ల రామయ్య చెప్పారు. నారావారి పల్లెలో వైసీపీ సభకు పోలీసులు ఎలా అనుమతి ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ రోజు మధ్యాహ్నం సభ నిర్వహించాలని వైసీపీ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. దీంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వారిని నిరసన విరమించాలని పోలీసులు కోరుతున్నారు.

More Telugu News