Khammam District: అన్నదాత కుటుంబంలో సరస్వతీ కటాక్షం

  • నాన్న నిరుపేద రైతు...పిల్లలంతా ఉద్యోగులే 
  • నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు
  • అమెరికాలో స్థిరపడిన ఒక కుమార్తె

ఆరుగాలం శ్రమిస్తేగాని కుటుంబ జీవనం సాగని నిరు పేద వ్యవసాయ కుటుంబంలో సరస్వతీపుత్రులు వారంతా. పొలం పనులు చేసుకుంటూ ఇంటిని నడుపుతున్న అమ్మానాన్న కష్టాన్ని కళ్లారా చూసిన వారు చదివి ఉన్నత స్థానాలకు చేరాలన్న ఆకాంక్షను నెరవేర్చుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే...ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామానికి చెందిన కాకుమాను మంగిరెడ్డి, లక్ష్మి దంపతులకు నలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. మంగిరెడ్డి చిన్న రైతు. దంపతులు ఇద్దరూ పొలం పనులు చేసుకోగా వచ్చిన మొత్తమే వారి కుటుంబానికి జీవనాధారం.

అయినా పిల్లల చదువు విషయంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగానే పిల్లలు చదివి మంచి స్థానాల్లో స్థిరపడ్డారు. మంగిరెడ్డి నలుగురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె నాగమణి ప్రభుత్వ ఉపాధ్యాయిని. రెండో కుమార్తె జానకి తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో శానిటరీ, హెల్త్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగం సాధించింది. మూడో కుమార్తె అమెరికాలో ఫార్మారంగంలో స్థిరపడింది. ఇక నాలుగో కుమార్తె మనోజ, కుమారుడు ప్రవీణ్ గోపిరెడ్డి బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. 

More Telugu News