నిర్భయ దోషులకు టైమొచ్చింది... ఆదివారమైనా నేడు కోర్టులో విచారణ!
- పదేపదే ఉరి అమలు వాయిదా
- చట్టాల్లోని లొసుగులే అడ్డం
- ఉరిపై స్టేకు వ్యతిరేకంగా కేంద్రం పిటిషన్
- నేడు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ
దీన్ని తీవ్రంగా తీసుకున్న కేంద్రం, స్టేకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు, తీహార్ జైలు అధికారులు, దోషులకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఈ కేసు విచారణను సెలవు దినమైనా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేపడతామని వెల్లడించింది.
కాగా, నిర్భయ దోషులను తక్షణం ఉరితీయాలని దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. వీరికి శిక్ష అమలుపై తప్పు మీదంటే, మీదని కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలోనే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న నలుగురికీ శిక్ష అమలు తప్పదని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.