తహశీల్దార్ కార్యాలయంలోనే వీఆర్వోను చెప్పుతో కొట్టిన రైతు!
- అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఘటన
- తల్లి పేరున కాకుండా చిన్నాన్న పేరున పట్టా చేసిన వీఆర్వో
- వీఆర్వోతో వాగ్వివాదం..ఆపై దాడి
అయితే, రోజులు గడుస్తున్నా పనిచేసి పెట్టకుండా తిప్పించుకుంటున్నాడు. తాజాగా, ఆ భూమి పట్టాను తన చిన్నాన్న పేరున చేసినట్టు తెలుసుకున్న నాగభూషణం నిన్న తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ కుమారస్వామిని కలిసి వాగ్వివాదానికి దిగాడు. అది మరింత ముదరడంతో నాగభూషణం చెప్పు తీసుకుని వీఆర్వోపై దాడిచేశాడు. వీఆర్వో ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగభూషణాన్ని అదుపులోకి తీసుకున్నారు.