China: చైనా మాస్టర్స్ టోర్నీకి కరోనా పోటు!

  • తీవ్రంగా విస్తరిస్తున్న కరోనా వైరస్
  • చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ వాయిదా
  • ఈ నెల 25న ప్రారంభం కావాల్సిన టోర్నీ
  • ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకున్న అగ్రశ్రేణి క్రీడాకారులు

చైనాలో మొదలై అనేక దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు క్రీడారంగంపై పడింది. వైరస్ కారణంగా జనజీవనం దెబ్బతిన్న నేపథ్యంలో చైనాలో నిర్వహించాల్సిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ ఫిబ్రవరి 25 నుంచి జరగాల్సి ఉంది. చైనా దక్షిణ ప్రాంతంలోని హైనాన్ ద్వీపం ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. అయితే, కరోనా వైరస్ ముప్పు అధికంగా ఉండడంతో టోర్నీ వాయిదా వేయాలని నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి చాలామంది అగ్రశ్రేణి క్రీడాకారులు తప్పుకున్నారు. అటు, వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ కూడా టోర్నీ వాయిదా వేయడమే మంచిదని అభిప్రాయపడింది.

More Telugu News