విద్యార్థులతో ఢిల్లీలో ల్యాండ్ అయిన విమానం.. చావ్లా క్యాంపునకు తరలింపు.. 14 రోజుల అబ్జర్వేషన్!
- కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆర్మీ క్యాంపునకు విద్యార్థుల తరలింపు
- 14 రోజుల పాటు వైద్య పరీక్షలు
- ఆ తర్వాతే ఇంటికి
వూహాన్‌లో చదువుకుంటున్న 350 మంది భారత విద్యార్థులను స్వదేశం తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపింది. అయితే, విద్యార్థుల్లో ఆరుగురు తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో విమానం ఎక్కేందుకు వారికి అనుమతి లభించలేదు. దీంతో మిగతా విద్యార్థులతో విమానం బయలుదేరింది.