Ramgopalvarma: జొన్నవిత్తులకు షాక్... 'ఆర్జీవీ.. ఓ సైకో బయోపిక్' టైటిల్ రిజిస్ట్రేషన్ కు నో చెప్పిన ఫిల్మ్ చాంబర్!

షార్ట్స్‌లో చూడండి
'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' చిత్రం సమయంలో రచయిత జొన్నవిత్తుల, దర్శకుడు ఆర్జీవీ మధ్య పెద్ద యుద్ధమే జరిగిందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వర్మ శ్రుతిమించి మాట్లాడాడని, ఆయనపై ఓ బయోపిక్ ను తీస్తానని, దానికి 'ఆర్జీవీ' అనే టైటిల్ పెడుతున్నానని, దానికి సైకో బయోపిక్ అనే ట్యాగ్ లైన్ ఉంటుందని జొన్నవిత్తుల సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

 ఇప్పుడు జొన్నవిత్తులకు ఫిల్మ్ చాంబర్ ఊహించని షాక్ ఇచ్చింది. 'ఆర్జీవీ' అనే టైటిల్ ను రిజిస్టర్ చేసేందుకు నిరాకరిస్తూ, రామ్ గోపాల్ వర్మ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని సూచించింది. దీంతో ప్రస్తుతానికి జొన్నవిత్తుల ప్రయత్నానికి బ్రేక్ పడినట్లే. కాగా, గతంలో వర్మ సినిమా టైటిల్, ప్రమోషన్ విధానాలపై జొన్నవిత్తుల తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Ramgopalvarma
Phsyco
Jonnavittula
Biopic

More Telugu News