Lumpi skin: కోనసీమలో కొత్త వైరస్.. ఇరవై ఆవులు మృతి!

  • కొత్త వైరస్ ‘లంపీ స్కిన్’  
  • వెయ్యికి పైగా ఆవులకు సోకిన వైరస్
  • ఉత్తరాది నుంచి కోనసీమకు వ్యాపించిన ‘లంపీ స్కిన్’

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ ను ‘లంపీ స్కిన్’గా పిలుస్తున్నారు. వెయ్యికి పైగా ఆవులకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అందులో ఇరవై ఆవులు ఇప్పటికే మృతి చెందినట్టు సమాచారం. కాగా, ఉత్తరాది నుంచి కోనసీమకు ఈ వైరస్ వ్యాపించినట్టు వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు.

More Telugu News