వుహాన్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు జంబో విమానాన్ని పంపిన కేంద్రం
- ఢిల్లీ నుంచి వుహాన్ బయల్దేరిన బోయింగ్ 747 విమానం
- 432 మందిని తరలించగలిగే సామర్థ్యం ఈ విమానం సొంతం
- శనివారం వుహాన్ వెళ్లనున్న మరో విమానం
ఈ బోయింగ్ విమానం ఢిల్లీ నుంచి ఈ మధ్యాహ్నం బయల్దేరింది. వుహాన్ నుంచి 400 మంది భారతీయులను ఈ విమానం ద్వారా భారత్ తరలిస్తారు. ఈ బి747 జంబో విమానం శనివారం వేకువజామున తిరిగి ఢిల్లీ చేరుకోనుంది. ఈ విమానంలో మొత్తం 432 మంది ప్రయాణించే వీలుంది. కాగా, శనివారం చైనాకు మరో విమానాన్ని పంపించనున్నారు. చైనా నుంచి భారత్ చేరుకోనున్న వ్యక్తులను 14 రోజుల పాటు ప్రత్యేక వార్డులో ఉంచి పరిశీలించనున్నారు.