Sharjeel Imam: షర్జీల్ ఇమామ్ లాంటి వాళ్లను ఏరిపారేయాలి: శివసేన

  • ఈశాన్య రాష్ట్రాలు భారత్ నుంచి విడిపోవాలన్న షర్జీల్
  • బీహార్ లో అరెస్ట్
  • దేశద్రోహం కేసు నమోదు
  • షర్జీల్ ను చీడపురుగుతో పోల్చిన శివసేన

కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికీ నిరసన జ్వాలలు చల్లారలేదు. కాగా ఈ అంశంలో జేఎన్ యూ పీహెచ్ డీ విద్యార్థి షర్జీల్ ఇమామ్  తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈశాన్య రాష్ట్రాలు భారత్ నుంచి విడిపోవాలంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పోలీసులు అతడిని బీహార్ లో అరెస్ట్ చేసి దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనిపై శివసేన పార్టీ స్పందించింది. షర్జీల్ ఇమామ్ ను అరెస్ట్ చేయడం సరైన చర్య అని, ప్రజలను రెచ్చగొట్టే అలాంటి వాళ్లను ఏరిపారేయాలని పేర్కొంది. ప్రజల్లో విద్వేషాలు రగిల్చే షర్జీల్ ఇమామ్ వంటి చీడపురుగులను సమాజంలో తిరిగేందుకు అనుమతించరాదని వ్యాఖ్యానించింది. ప్రజలను ఉసిగొల్పే ఇటువంటి వారితో రాజకీయాలు చేయరాదని సూచించింది.

More Telugu News