తల్లి పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరిపించిన చిరంజీవి... ఫొటోలు షేర్ చేసిన నీహారిక!
Add ap7am to your home Screen

తల్లి పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరిపించిన చిరంజీవి... ఫొటోలు షేర్ చేసిన నీహారిక!

  • తల్లితో కేక్ కట్ చేయించిన చిరు
  • అంజనాదేవితో మెగాస్టార్ సెల్ఫీ
  • హాజరుకాని పవన్ కల్యాణ్
మెగాస్టార్ చిరంజీవి, తన తల్లి అంజనాదేవి పుట్టిన రోజు వేడుకలను వైభవంగా జరిపించగా, అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తల్లితో కేక్ కట్ చేయించిన చిరు, ఆపై ఆమెతో సెల్ఫీ దిగారు. అంజనాదేవి రెండో కుమారుడు నాగబాబు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అయితే, మూడో కుమారుడు పవన్ కల్యాణ్ మాత్రం బర్త్ డే ఫంక్షన్ కు హాజరు కాలేదు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నందునే హాజరు కాలేదని మెగా ఫ్యామిలీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక పుట్టినరోజు వేడుకల ఫొటోలను నాగబాబు కుమార్తె నీహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. టాప్ హీరోలను తెలుగు ఇండస్ట్రీకి అందించిన అంజనాదేవి, నిండు నూరేళ్లూ సుఖంగా జీవించాలని మెగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
Chiranjeevi
Pawan Kalyan
Anjanidevi
Birthday
Niharika

More Telugu News