China: 'కరోనా' ఎఫెక్ట్.. చైనాలో చిక్కుకుపోయిన 58 మంది తెలుగు యువత.. ఆందోళనలో తల్లిదండ్రులు!

  • ప్రాంగణ నియామకాల ద్వారా వుహాన్ వెళ్లిన తెలుగు యువత 
  • శ్రీసిటీ టీసీఎల్ కంపెనీలో పనిచేస్తోన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు
  • శిక్షణ నిమిత్తం వుహాన్ వెళ్లిన యువత

చైనాలోని వుహాన్‌ నగరంలో తెలుగు యువత  చిక్కుకుపోయారు. వారి కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రాంగణ నియామకాల ద్వారా శ్రీసిటీ టీసీఎల్ కంపెనీకి ఎంపికైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు శిక్షణ నిమిత్తం గతంలో వుహాన్ వెళ్లారు. మొత్తం 96 మందిని శిక్షణ కోసం ఆ కంపెనీ చైనాకు పంపింది.

2019 ఆగస్టులో చైనా వెళ్లిన వారిలో 38 మంది నవంబరులోనే వచ్చారు. అయితే, వుహాన్‌ కంపెనీ హాస్టల్లోనే  58 మంది ఇంజనీర్లు ఉండిపోయారు. కరోనా వైరల్ ఎఫెక్ట్‌ నేపథ్యంలో స్వస్థలాలకు చేరుద్దామని ఆ కంపెనీ ప్రయత్నించింది. అయితే, అప్పటికే నిషేధం అమల్లోకి రావడంతో నిస్సహాయత వ్యక్తం చేసింది. తమ పిల్లలను భారత్‌కు రప్పించాలని ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు కోరుతున్నారు.

More Telugu News