మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడింది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడింది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

  • అక్రమాలు చేస్తూ ఆదర్శాలు చెప్పడం వారికే చెల్లింది
  • కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు
  • ప్రలోభాలు, అవినీతితో జరిగిన ఎన్నికలు కూడా ఓ ఎన్నికలేనా?
అక్రమాలు చేస్తూ ఆదర్శాలు చెప్పడం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకే చెల్లుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.

వార్డుల రూపకల్పన, రిజర్వేషన్లు తదితర అంశాల్లో టీఆర్ఎస్ అక్రమాలు చేసిందన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీతో తెలంగాణలో ఎలా ఓటు వేయిస్తారన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు ఇలా ఉంటాయా? అని ప్రశ్నించారు. ప్రలోభాలు, అవినీతితో జరిగిన ఎన్నికలు కూడా ఓ ఎన్నికలేనా? అదీ ఓ గెలుపేనా? అని ఎద్దేవా చేశారు.
BJP
Lakshman
Telangana
TS Municipal Elections

More Telugu News