Hyderabad: హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటోన్న 'సాఫ్ట్‌వేర్' అమ్మాయికి వేధింపులు

  • హైదరాబాద్‌లోని ఓ సంస్థలో పనిచేస్తోన్న యువతి
  • శశాంక్ అనే యువకుడి నుంచి వేధింపులు
  • వరంగల్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో పని చేస్తోన్న అమ్మాయి

హైదరాబాద్‌లో ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోన్న ఓ అమ్మాయికి వేధింపులు ఎదురవుతున్నాయి. ఆమె ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఆమెను శశాంక్ అనే యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడు. అతడి వేధింపులు తాళలేక చివరకు ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.

తనను పెళ్లి చేసుకోవాలని కొంత కాలంగా అతడు వేధిస్తున్నాడని తెలిపింది. తాను వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నానని ఈ క్రమంలో తనకు వేధింపులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో శశాంక్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News