Slumdog Millioner: 'స్లమ్ డాగ్ మిలియనీర్' యంగ్ స్టార్స్... ఇప్పుడు కడు దీనావస్థలో..!

  • సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'స్లమ్ డాగ్ మిలియనీర్'
  • అప్పట్లో బాల నటుల కోసం ఓ ట్రస్ట్
  • ఇచ్చిన ఇళ్లను అమ్మేసుకుని తిరిగి పేదరికంలో...

ముంబై, స్లమ్ ఏరియాలో పెరిగి, 'కౌన్ బనేగా కరోడ్ పతి' పోటీలో పాల్గొని విజయం సాధించిన యువకుడి కథతో అప్పుడెప్పుడో వచ్చిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాలో హీరో, హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలను పోషించిన అజారుద్దీన్ ఇస్మాయిల్, రూబీనా కురేషీలు ఇప్పుడు అత్యంత దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నారు.

8 ఆస్కార్ అవార్డులను గెలుచుకునేంత ఘన విజయాన్ని సినిమా సాధించిన తరువాత, దర్శకుడు డానీ బాయల్ 'జై హో' పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, బాల కళాకాకారులు అజహర్, రూబీనా కురేషీలకు సాయం అందించారు. వారికి ఇళ్లను, నెలవారీ పెన్షన్ ను ఏర్పాటు చేశారు.

ఇది జరిగిన పదేళ్లకు అటు అజహర్, ఇటు రుబీనాలు తమ ఫ్లాట్ లను విక్రయించారు. ప్రస్తుతం అజహర్ బాంద్రా ఈస్ట్ స్లమ్ ఏరియాలోని ఓ గుడిసెలో జీవిస్తున్నాడు. తన కుమారుడు వ్యాపారంలో నష్టపోయాడని, అనారోగ్యం బారిన పడ్డాడని, పెన్షన్ కూడా ఆగిపోయిందని అతని తల్లి షమీనా వాపోయింది. ఇక రుబీనా 20 ఏళ్లుగా మేకప్ ఆర్టిస్టుగా పని చేస్తూ, చిన్న ఇంట్లో కాలం గడుపుతోంది. తామిద్దరినీ మరోమారు ఆదుకోవాలని వారు కోరుకున్నారు.

More Telugu News