Stock Market: కరోనా వైరస్, ఇరాక్ లో దాడులతో డీలా పడిన భారత స్టాక్ మార్కెట్

  • డౌన్ ట్రెండ్ లో భారత సూచీలు
  • నేటి ట్రేడింగ్ లో ఆరంభం నుంచే నష్టాలు
  • మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా షేర్లకు లాభాలు
  • నష్టాలు తప్పించుకోలేకపోయిన టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్

చైనాను కుదిపేస్తూ, క్రమంగా ఇతర దేశాలకు విస్తరిస్తున్న కరోనా వైరస్ ఓవైపు, ఇరాక్ లో అమెరికా ఎంబసీపై దాడులు మరోవైపు భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ట్రేడింగ్ ఆరంభం నుంచే సూచీలు డౌన్ ట్రెండ్ లో పయనించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు ఆశాజనకంగా ట్రేడయ్యాయి.

అదే సమయంలో, జేఎస్ డబ్ల్యూ స్టీల్, వేదాంత, టాటా స్టీల్, హిండాల్కో షేర్లు నష్టాలు చవిచూశాయి. ఇక, బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసేసరికి 458 పాయింట్ల నష్టంతో 41,155 వద్ద క్లోజయింది. నిఫ్టీ కూడా నష్టాలను తప్పించుకోలేకపోయింది. 129 పాయింట్ల నష్టంతో 12,119 వద్ద స్థిరపడింది.

More Telugu News