CPI Ramakrishna: హోదా సాధించే దమ్ము లేక మండలి రద్దు ప్రతిపాదన తీసుకువచ్చారు: సీపీఐ రామకృష్ణ

  • రాష్ట్ర పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిగా మారిందన్న రామకృష్ణ
  • అభివృద్ధికి మండలి అడ్డంకిగా మారిందనడం సరికాదని వ్యాఖ్యలు
  • ఏపీ పరిపాలన చూసి ఇతర రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయని విమర్శలు
రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిగా మారిందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. విభజన హామీల అమలుకు మండలి అడ్డొచ్చిందా? అంటూ ప్రశ్నించారు. అభివృద్ధికి  మండలి అడ్డంకిగా మారిందని సీఎం చెప్పడం సరికాదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే దమ్ములేక సీఎం జగన్ మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వ పాలన చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారని విమర్శించారు. చివరికి సీఎం సైతం బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తోందని రామకృష్ణ పేర్కొన్నారు.
CPI Ramakrishna
Jagan
AP Legislative Council
Abolition
Special Category Status

More Telugu News