శాసనమండలిని తండ్రి తెస్తే.. కొడుకు రద్దు చేస్తున్నారు: ఎమ్మెల్సీ మాధవ్
- రద్దు విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదు
- ఈ విషయంలో వైసీపీ, టీడీపీ పార్టీలు దోషులే
- రాష్ట్రపతి ఆర్డర్ వచ్చే వరకూ మండలి కొనసాగుతుంది
శాసన మండలి రద్దు విషయంలో.. వైసీపీ, టీడీపీ పార్టీలు దోషులేనని ఆయన వ్యాఖ్యానించారు. రద్దు విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదన్నారు. మండలి రద్దుకు కొంచెం సమయం పట్టచ్చన్నారు. దీనిపై న్యాయపోరాటం చేసే అవకాశముందని, రాష్ట్రపతి ఆర్డర్ వచ్చే వరకూ మండలి కొనసాగుతుందని అన్నారు.