India: బీసీసీఐని బెదిరించడంపై వెనుకంజ వేసిన పాక్ క్రికెట్ బోర్డు!

  • మాట మార్చిన పీసీబీ సీఈఓ 
  • తన మాటలు సరిగా అర్థం చేసుకోలేదని వ్యాఖ్యలు 
  • భారత్ ఆడాల్సిన మ్యాచ్ లపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి

తమ గడ్డపై నిర్వహించే ఆసియా కప్ టోర్నీలో భారత్ ఆడకపోతే, భారత్ లో నిర్వహించే టి20 ప్రపంచకప్ లో తమ జట్టు ఆడదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బెదిరింపు స్వరం వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, అంతలోనే పీసీబీ మాట మార్చింది. పీసీబీ సీఈఓ వసీమ్ ఖాన్ స్పందిస్తూ, తాను మాట్లాడిన మాటలను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. ఆసియా కప్ ను పాకిస్థాన్ లోనే నిర్వహిస్తామని, భారత్ ఆడాల్సిన మ్యాచ్ లపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆసియా క్రికెట్ మండలి మాత్రమేనని తాజాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, 2021లో భారత గడ్డపై జరిగే టి20 వరల్డ్ కప్ ను కూడా తాము బహిష్కరించబోమని స్పష్టం చేశారు.

More Telugu News