Telugudesam: అప్పటి వరకూ శాసనమండలి రద్దు కాదు : టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల

  • శాసనసభను నడుపుతోంది స్పీకరా? సీఎమ్మా?
  • మండలి రద్దుకు ప్రభుత్వం తీర్మానమే చేయగలదు
  • రాష్ట్రపతి ఆమోదం లభించే వరకూ మండలి ఉంటుంది

ఏపీ అసెంబ్లీ స్పీకర్, సీఎం లపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సెటైర్లు విసిరారు. శాసనసభను స్పీకర్ నడుపుతున్నారో లేక సీఎం నడుపుతున్నాడో తమకు అర్థంకావట్లేదని, ఆయన, ఈయన నవ్వుకుంటూ ఉంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఇలాంటి పరిస్థితుల్లో రేపటి సమావేశానికి వెళ్లి లాభం ఏంటి? అని ప్రశ్నించారు. శాసనమండలిని రద్దు చేయాలని ఒకవేళ తీర్మానం చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని అన్నారు.

ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనమండళ్లను రద్దు చేయమని, పునరుద్ధరించమని కోరుతూ ఆరేడు కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. నాడు టీడీపీ హయాంలో శాసనమండలిని రద్దు  చేయడానికి ఐదేళ్లు పడితే ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించడానికి ఇరవై రెండేళ్లు పట్టిందని అన్నారు. మండలిని రద్దు చేయాలంటే దానికి ఓ ప్రొసిజర్ ఉందని అదంతా పూర్తయ్యే వరకూ మండలి కొనసాగుతుందని, చైర్మన్, సభ్యులు అలాగే ఉంటారని, వాళ్ల హక్కులను ఎవరూ హరించలేరని వివరించారు. రాష్ట్రపతి అనుమతి లభించే వరకు శాసనమండలిని రద్దు చేయడం వైసీపీ ప్రభుత్వం తరం కాదని అన్నారు.

More Telugu News