Andhra Pradesh: ఏపీలో వేడుకగా గణతంత్ర వేడుకలు!

  • సచివాలయంలో జెండా ఎగురవేసిన నీలం సాహ్ని
  • సీఎంఓలో అజేయకల్లం, అసెంబ్లీలో తమ్మినేని
  • జిల్లా కేంద్రాల్లో జెండాలను ఎగురవేసిన కలెక్టర్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 71వ రిపబ్లిక్ వేడుకలు వైభవంగా జరిగాయి. వెలగపూడి సెక్రటేరియేట్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ ఉదయం జాతీయ జెండాను ఎగురవేయగా, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, చీఫ్‌ సెక్యూరిటీ అధికారి కేకే మూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యాలయంలో ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండాను ఎగురవేయగా, సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్య రాజ్‌, ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఇక అసెంబ్లీలో జరిగిన వేడుకల్లో స్పీకర్‌ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగురవేశారు. శాసనమండలిలో ఛైర్మన్‌ షరీఫ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, మండల కేంద్రాల్లో ఎమ్మార్వోలు, ఆర్డీఓలు జాతీయ జెండాలను ఎగురవేశారు.

More Telugu News