Cyber Crime: అమెరికాలో ఉద్యోగం అనగానే రూ. 2 లక్షలు కట్టిన హైదరాబాద్ యువతి... ఆపై నిలువెత్తు మోసం!

  • ఓఎల్ఎక్స్ లో ఉద్యోగ ప్రకటన
  • చూసి రూ. 1.97 లక్షలు కట్టిన యువతి
  • నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

అమెరికాలో ఉద్యోగాలు ఉన్నాయని, వాటిని సులువుగా పొందే మార్గం చూపిస్తానని, ఓ సైబర్ మోసగాడు, వలవేయగా, హైదరాబాద్ కు చెందిన ఓ యువతి నిలువునా మోసపోయింది. సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, బుర్రా దినేశ్ కుమార్ గౌడ్ (28) అనే యువకుడు, ఓఎల్ఎక్స్ మాధ్యమంగా, యూఎస్ లో ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటనలు ఇచ్చాడు. వాటిని చూసిన అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన యువతి, దినేశ్ ను సంప్రదించింది.

అమెరికాలో ఉద్యోగం కావాలంటే, వీసా, విమానం టిక్కెట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు తదితరాలు చెల్లించాలంటూ, అతను చెబితే, నమ్మి పలు దఫాలుగా రూ. 1.97 లక్షలను, దినేశ్ చెప్పిన ఖాతాల్లో వేసింది. ఆపై ఎంతకాలానికీ, ఆమెకు ఉద్యోగం రాకపోవడం, అతని ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో, మోసపోయానని గమనించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని, విచారించిన పోలీసులు, అధునాతన సాంకేతికత ఆధారంగా నిందితుడిని గుర్తించి, అరెస్ట్ చేశారు.

More Telugu News