భారత్ నుంచి అసోంను విడగొడితే పోలా: సీఏఏ వ్యతిరేక నిరసనకారుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- అసోంను విడగొడితేనే భారత్ మన మాట వింటుంది
- ఐదు లక్షల మందిని కూడగడితే అసోంను శాశ్వతంగా విడదీయొచ్చు
- రైల్వే ట్రాకులు, రోడ్లపై గొడవలు సృష్టిద్దాం
అసోంను విడదీస్తేనే ప్రభుత్వం మాట వింటుందని, రైల్వే ట్రాకులు, రోడ్లపై గొడవలు సృష్టిస్తే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వానికి కనీసం నెల రోజులైనా పడుతుందని అన్నాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఈ నెల 16న ఆయనీ వ్యాఖ్యలు చేసినట్టు ఎస్సెస్పీ ఆకాశ్ కుల్హరి నిర్ధారించారు. అసోంపై ఇమామ్ చేసిన వ్యాఖ్యలకు గాను ఇమామ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది.