assam: భారత్‌ నుంచి అసోంను విడగొడితే పోలా: సీఏఏ వ్యతిరేక నిరసనకారుడు వివాదాస్పద వ్యాఖ్యలు

  • అసోంను విడగొడితేనే భారత్ మన మాట వింటుంది
  • ఐదు లక్షల మందిని కూడగడితే అసోంను శాశ్వతంగా విడదీయొచ్చు
  • రైల్వే ట్రాకులు, రోడ్లపై గొడవలు సృష్టిద్దాం

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనకారుడు, జేఎన్‌యూ మాజీ విద్యార్థి షర్జీల్ ఇమామ్ అసోంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత సంబిత్ పాత్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఐదు లక్షల మందిని కనుక కూడగట్టగలిగితే భారత్‌ నుంచి అసోంను శాశ్వతంగా విడగొట్టేయొచ్చన్న ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారత సైన్యం అసోం చేరాలంటే చికెన్ నెక్ కారిడార్ గుండానే వెళ్లాలని, ఆ ప్రాంతం ముస్లింలదే కాబట్టి దానిని అడ్డుకోవాలని ఇమామ్ పిలుపునిచ్చాడు.  

అసోంను విడదీస్తేనే ప్రభుత్వం మాట వింటుందని, రైల్వే ట్రాకులు, రోడ్లపై గొడవలు సృష్టిస్తే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వానికి కనీసం నెల రోజులైనా పడుతుందని అన్నాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఈ నెల 16న ఆయనీ వ్యాఖ్యలు చేసినట్టు ఎస్సెస్పీ ఆకాశ్ కుల్హరి నిర్ధారించారు. అసోంపై ఇమామ్ చేసిన వ్యాఖ్యలకు గాను ఇమామ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది.  

More Telugu News