రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రత... అమరావతి పరిధిలోనూ భూ ప్రకంపనలు!
- గత రాత్రి భూ ప్రకంపనలు
- గుంటూరు జిల్లాలోనూ గుర్తించిన ప్రజలు
- ఆర్తనాదాలు చేసిన మూగజీవాలు
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, వెంకటాయపాలెం, క్రోసూరు, మాచవరం, తుళ్లూరు తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. పెదకూరపాడు, కొత్తపల్లి, బెల్లంకొండ, మాచర్ల తదితర మండలాల్లోనూ ప్రకంపనలను ప్రజలు గమనించారు. జగ్గయ్యపేట, నందిగామ మండలాల్లోనూ భూమి కంపించింది. భూ ప్రకంపనల సమయంలో పక్షులు, మూగజీవాలు ఆర్తనాదాలు చేశాయని ప్రజలు వెల్లడించారు.