పవన్ పై దుష్ప్రచారం... పరువునష్టం దావా వేయనున్న జనసేన
- అమరావతిలో పవన్ కు 62 ఎకరాల భూములు ఉన్నాయని ప్రచారం
- తీవ్రంగా పరిగణించిన జనసేన న్యాయవిభాగం
- ఒకట్రెండు రోజుల్లో లీగల్ నోటీసులు పంపుతామని వెల్లడి
ఈ ప్రచారానికి కారకులైన వారికి లీగల్ నోటీసులు పంపుతామని జనసేన పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ ఓ ప్రకటనలో తెలిపారు. జనసేనను రాజకీయంగా ఎదుర్కోలేక, జనసేన సాగిస్తున్న ప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడుండడంతో ఎదురునిలిచి పోరాడలేని అల్పులే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.