TRS: మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ హవా

  • ఫలితాలు వెలువడే కొద్దీ పెరుగుతున్న టీఆర్ఎస్ స్థానాలు
  • ఉదయం 11గం.వరకు టీఆర్ఎస్ ఖాతాలో 627 స్థానాలు
  • కాంగ్రెస్ కూటమి ఖాతాలో 169 స్థానాలు
  • బీజేపీకి 76 స్థానాలు

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది. ఫలితాలు వెలువడుతున్నకొద్దీ టీఆర్ఎస్ ఖాతాల్లో పడుతున్న స్థానాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఉదయం 11గంటల వరకు వెలువడ్డ పలితాల సరళిని పరిశీలిస్తే.. మొత్తం 2979 స్థానాలకు గాను టీఆర్ఎస్ 627 స్థానాలు గెలుపొందగా కాంగ్రెస్ కూటమి 169, బీజేపీ 76, ఎఐఎం 14 స్థానాలను గెలుచుకున్నాయి. ఇతరులు 44 స్థానాలను సొంతం చేసుకున్నారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీని టీఆర్ఎస్ గెలుచుకుంది. నిజామాబాద్ జిల్లా భీంగల్ లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, కరీంనగర్ జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ, కొత్తపల్లి మున్సిపాలిటీ, మహబూబ్ నగర్ జిల్లా కొత్తకొట మున్సిపాలిటీ, వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. డోర్నకల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ ఏకపక్షంగా గెలుచుకుంది.

నారాయణ్ ఖేడ్, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో మెజార్టీ స్ధానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మరోవైపు తెలంగాణ భవన్లో  టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫలితాల సరిళిని సమీక్షిస్తున్నారు. ఎక్స్ అఫిషియో ఓటు వినియోగంపై ఎంపీలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నాయి. పార్టీ విజయం పట్ల కార్యకర్తలు, నేతలు సంబరాల్లో మునిగిపోయారు.

More Telugu News