'బంగార్రాజు'ను లైన్లో పెట్టేస్తున్న నాగార్జున
- గతంలో హిట్ కొట్టిన కాంబినేషన్
- మార్చి నుంచి మళ్లీ సెట్స్ పైకి
- ముఖ్యమైన పాత్రలో నాగచైతన్య
అయితే ఇతర ప్రాజెక్టులతో నాగార్జున బిజీగా ఉండటం వలన .. కల్యాణ్ కృష్ణ వ్యక్తిగత కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఇప్పడు ఈ ప్రాజెక్టు ముందుకు కదిలినట్టు తెలుస్తోంది. కథపై కసరత్తు పూర్తిచేసిన కల్యాణ్ కృష్ణ, అనూప్ రూబెన్స్ తో కలిసి మ్యూజిక్ సిటింగ్స్ లో పాల్గొంటున్నాడని సమాచారం. మార్చి 3వ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. నాగార్జున - రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమాలో, నాగచైతన్య ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.