Telugudesam: మండలి చైర్మన్ షరీఫ్ ను మంత్రి బొత్స ఎన్ని బూతులు తిట్టారో!: చంద్రబాబునాయుడు

  • మండలి సమావేశాల్లో షరీఫ్ పై దారుణంగా ప్రవర్తించారు
  • షరీఫ్ ని వైసీపీ మంత్రులు బెదిరించారు
  • ‘సాయిబుగా పుట్టావా? నీ అంతు చూస్తా?’ అన్నారు
శాసనమండలిలో ప్రవేశపెట్టిన బిల్లులు పాసవుతాయని, నెగ్గుతామని వైసీపీ సభ్యులు ఎలా అనుకున్నారోనని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మంగళగిరిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'శాసన మండలి సమావేశాల్లో రెండో రోజున చైర్మన్ షరీఫ్ ను వైసీపీ సభ్యులు ఎన్ని బూతులు తిట్టారనుకున్నారూ' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘సాయిబుగా పుట్టావా? నీ అంతు చూస్తా?’ అంటూ షరీఫ్ ని బెదిరించారని, మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఇంకా తన ఇష్టానుసారం బూతులు తిట్టారని, గ్యాలరీలో కూర్చున్న తాను ఇదంతా గమనించినట్టు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం పాలు చేస్తుంటే చూస్తూ కూర్చోవడం, ఊరుకోవడం కరెక్టు కాదన్న ఉద్దేశంతోనే ఆ రోజున తాను శాసనమండలి గ్యాలరీకి వెళ్లానని స్పష్టం చేశారు.
Telugudesam
Chandrababu
YSRCP
Botsa Satyanarayana Satyanarayana
Shariff Mohammed Ahmed
AP Legislative Council

More Telugu News