Chandrababu: మండలిలో మంత్రుల వైఖరిపై గవర్నర్ కు పెన్ డ్రైవ్ ను అందజేసిన చంద్రబాబు

  • గవర్నర్ తో చంద్రబాబు భేటీ
  • శాసనసభ, మండలి సమావేశాల తీరును వివరించిన బాబు
  • ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు
గత కొన్నిరోజులుగా ఏపీ శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వ వైఖరిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సాయంత్రం ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ముఖ్యంగా, మండలిలో వైసీపీ మంత్రుల తీరుతెన్నులకు సంబంధించిన ఓ పెన్ డ్రైవ్ ను గవర్నర్ కు అందజేశారు. మంత్రులు చైర్మన్ పోడియంను ముట్టడించి, అనుచితంగా ప్రవర్తించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గవర్నర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.
Chandrababu
Governor
Biswabhusan Harichandan
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News