Mouni Amavasya: పవిత్ర వారణాసికి తండోపతండాలుగా భక్తుల రాక

  • సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య మంచిదని భక్తుల నమ్మిక
  • దీనికి మౌని అమావాస్యగా మరోపేరు
  • పితృతర్పణలకు అనువైన రోజు కావడంతో పోటెత్తిన భక్తులు
సంక్రాంతి తర్వాత వచ్చే 'పుష్యమాస అమావాస్య' ఎంతో మంచిరోజు అని హిందువులు విశ్వసిస్తారు. ఆ రోజున తమ పెద్దవారికి పితృ తర్పణలు సమర్పించడం, నదీ స్నానాలు చేస్తే మంచిదని నమ్ముతారు. పైగా 'పుష్యమాస అమావాస్య' నాడు మౌనవ్రతం పాటించడం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తారు. అందుకే ఈ అమావాస్యను 'మౌని అమావాస్య' అని కూడా పిలుస్తారు. ఈ 'మౌని అమవాస్య' సందర్భంగా వారణాసిలోని పవిత్ర గంగానదికి భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు చేసి, ఆచార సంప్రదాయల ప్రకారం పూజాదికాలు నిర్వహిస్తున్నారు.
Mouni Amavasya
Pushya Amavasya
Varanasi
Devotees
Ganga

More Telugu News