T20: సుదీర్ఘమైన కివీస్ పర్యటనకు టాస్ గెలుపుతో శ్రీకారం చుట్టిన టీమిండియా

  • నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టి20
  • ఆక్లాండ్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా కివీస్ పర్యటనలో భాగంగా తొలి టి20 మ్యాచ్ కు సిద్ధమైంది. ఆక్లాండ్ వేదికగా జరిగే ఈ టి20 పోరులో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. యువకులతో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా కఠినమైన న్యూజిలాండ్ పర్యటనను సానుకూల దృక్పథంతో ఆరంభించాలని తలపోస్తోంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ 5 టి20 మ్యాచ్ లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. ఇక్కడి వాతావరణం పర్యాటక జట్లకు సవాల్ గా నిలుస్తుందన్న నేపథ్యంలో కీలకమైన టాస్ గెలిచి టీమిండియా సుదీర్ఘ పర్యటనకు ఆశావహదృక్పథంతో శ్రీకారం చుట్టింది.
T20
Cricket
Kiwis
Team India
Team New Zealand
Auckland

More Telugu News