Pallam Raju: రాజధానిగా విశాఖ భేష్.. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా!: కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు

  • అమరావతిలో రాజధాని నిర్ణయం చంద్రబాబు తప్పు 
  • శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఆయన పట్టించుకోలేదు
  • ప్రభుత్వం పొదుపు చర్యలు పాటించాలి

రాజధానిని విశాఖకు మార్చాలన్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తాను వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు అన్నారు. పార్టీ అభిప్రాయం ఏమిటన్నది పీసీసీ అధ్యక్షుడు తెలియజేస్తారని చెప్పారు. రాజధానిగా విశాఖ అనువైన ప్రాంతమన్నారు.

 ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పల్లంరాజు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుచేశారని, శివరామకృష్ణన్ నిర్ణయాన్ని కూడా ఆయన పరిగణనలోకి తీసుకోకుండా సొంత నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున ప్రభుత్వం పొదుపు చర్యలు పాటించాలని, సత్వరం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని పల్లంరాజు సూచించారు.

Pallam Raju
Congress
Amaravati
Jagan
YSRCP
Visakhapatnam
AP Capital
Polavaram Project

More Telugu News