హీరో పర్సనాలిటీతో రతన్ టాటా ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్
- గంటలో లక్ష లైక్ లు.. వేల అభినందనలు
- ఆకట్టుకుంటున్న యువకుడిగా ఉన్న టాటా ఫొటో
- మూడు నెలల కింద ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా ప్రారంభం
యువకుడిగా ఉన్నప్పుడు రతన్ టాటా బాలీవుడ్ హీరోకు తీసిపోని రీతిలో ఉన్నాడని కామెంట్లు, షేర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఈ ఫొటో లాస్ ఏంజెల్స్ లో ఉన్నప్పుడు తీసిందని టాటా పేర్కొన్నారు. అమెరికాలోని జోన్స్ అండ్ ఎమ్మాన్స్ అనే సంస్థలో కొంతకాలం పనిచేసి 1962లో భారత్ కు తిరిగి వస్తోన్న సమయంలో ఈ ఫొటో తీయించుకున్నానని టాటా పేర్కొన్నారు.
మరోవైపు ఆయన ఫాలోవర్స్ కూడా రతన్ టాటా యువకుడిగా ఉన్న సమయంలో తీయించుకున్న మరో త్రోబ్యాక్ ఫొటోను పోస్ట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.