Gorantla Butchaiah Chowdary: అశ్లీల భాష యొక్క పాఠశాల.. దీనికి ప్రిన్సిపాల్ రోజా: వైసీపీ నేతలపై గోరంట్ల ఆసక్తికర పోస్ట్

  • హెచ్ఓడీ - కొడాలి నాని
  • డ్యాన్స్ మాస్టర్ - అంబటి
  • గెస్ట్ ఫ్యాకల్టీ - బొత్స
వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియాలో చమత్కారంతో కూడిన పోస్ట్ పెట్టారు. వైసీపీ నేతలు మాట్లాడుతున్న భాష, వారి తీరును ఎండగడుతూ సెటైర్లు వేశారు. తాడేపల్లిలో అశ్లీల భాష యొక్క పాఠశాల ఉందని... ఇందులో షార్ట్ టర్మ్ కోర్సు కూడా ఉందని... సాక్షి యందు ఆన్ లైన్ సదుపాయం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన పోస్ట్ ఇదే.

అశ్లీల భాష యొక్క పాఠశాల (షార్ట్ టర్మ్ కోర్సు), తాడేపల్లి. ఆన్లైన్లో కూడా సదుపాయం కలదు *సాక్షి ** నందు.
ప్రిన్సిపాల్ - రోజా గారు (తిట్లలో అనేక సంవత్సరాల ప్రావీణ్యం, అనుభవం కలదు)
హెచ్ఓడీ - కొడాలి నాని (నీ అమ్మమొగుడు అనే సర్టిఫికెట్ కోర్సు హోల్డర్)
ప్రొఫెసర్ - అనిల్ యాదవ్ (బుల్లెట్లు దింపడంలో అనుభవశీలి)
డ్యాన్స్ మాస్టర్ - అంబటి రాంబాబు (నాట్యం చేయడంలో దిట్ట. మరియు అనేక మందితో నాట్యం చేసిన అనుభవం)
గెస్ట్ ఫ్యాకల్టీ - బొత్స సత్యనారాయణ (బహుభాషా కోవిదుడు. ఏ విషయం అయినా స్పష్టంగా మాట్లాడే అనుభవం ఈయన సొంతం)
పీఈటీ - పృథ్వి రాజ్ (ఏదైనా సరే వెనక నుండి ఆకర్షించడం ఈయన ప్రత్యేకత)
మ్యాథ్స్ హెడ్ - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (తప్పుడు లెక్కని కరెక్ట్ గా చెప్పడంలో ఈయన మేధస్సు అమోఘమైనది)
డీన్ - సీయం జగన్ గారు (అన్ని విభాగాల్లో నైపుణ్యం ఈయన సొంతం)
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - విజయసాయిరెడ్డి (పారదర్శకంగా లెక్కలు చూపడంలో ఈయన అనుభవజ్ఞులు)
పరీక్ష విధానం - ప్రతిపక్ష పార్టీని తిట్టడంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులుకు మాత్రమే.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Gorantla Butchaiah Chowdary
Jagan
Roja
Kodali Nani
Ambati Rambabu
Vijayasai Reddy
Telugudesam
YSRCP

More Telugu News