NagaShaurya: ఆసక్తిని రేకెత్తిస్తున్న 'అశ్వద్ధామ' ట్రైలర్

  • స్వయంగా రాసుకున్న కథలో నాగశౌర్య
  • యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యత 
  • ఈ నెల 31వ తేదీన భారీ విడుదల
నాగశౌర్య కథానాయకుడిగా 'అశ్వద్ధామ' రూపొందింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాగశౌర్య రాసిన కథతో .. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ .. యాక్షన్ - ఎమోషన్ .. ఛేజింగ్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ఒక మర్డర్ మిస్టరీని హీరో ఛేదించడమే ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. "ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు .. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు .. వేట కుక్కల్లా వెంటపడే జాలరులు .. శకునిలాంటి ఒక ముసలోడు. వీళ్లందరినీ ఒకే స్టేజ్ పై ఆడిస్తున్న సూత్రధారి ఎవరు?" అనే నాగశౌర్య డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
NagaShaurya
Mehreen

More Telugu News