Vaishnav tej: 'ఉప్పెన' రిలీజ్ కి ముందే మరో సినిమాను లైన్లో పెట్టేసిన వైష్ణవ్ తేజ్

  • 'ఉప్పెన'తో పరిచయమవుతున్న వైష్ణవ్ తేజ్ 
  • తదుపరి సినిమా నందినీ రెడ్డితో 
  • త్వరలోనే పూర్తి వివరాలు  
సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'ఉప్పెన' రూపొందుతోంది. ఈ సినిమా ద్వారానే ఆయన తెలుగు తెరకి హీరోగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశలో వుంది.

ఈ సినిమా పూర్తవుతుండగానే వైష్ణవ్ తేజ్ మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. 'ఓ బేబీ' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నందినీ రెడ్డి, ఒక కథ వినిపించగా వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అశ్వనీదత్ కుమార్తెలు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Vaishnav tej
Nandini Reddy

More Telugu News