Boyapati Sreenu: బోయపాటిని పరామర్శించిన బాలకృష్ణ

  • శుక్రవారం కన్నుమూసిన బోయపాటి తల్లి
  • ఈ ఉదయం పెదకాకానికి వెళ్లిన బాలయ్య
  • బోయపాటి తల్లికి నివాళి అర్పించిన బాలకృష్ణ
టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన బోయపాటి శ్రీనును సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. బోయపాటి తల్లి సీతారావమ్మ (80) శుక్రవారంనాడు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం గుంటూరు జిల్లా పెదకాకానికి బాలయ్య వెళ్లారు. సీతారావమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బోయపాటిని పరామర్శించి, ఓదార్చారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బాలయ్య విజయవాడలో ఉన్న విషయం తెలిసిందే.

Boyapati Sreenu
Balakrishna
Tollywood
Telugudesam

More Telugu News