Telugudesam: ఆ తర్వాతే బిల్లుపై చర్చ ప్రారంభిద్దాం: మండలిలో పట్టుబట్టిన టీడీపీ సభ్యులు

  • శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలను ఎందుకు ఆపేశారు? 
  • వైసీపీ నేతలను నిలదీస్తోన్న టీడీపీ సభ్యులు
  • సాంకేతిక సమస్య తలెత్తిందన్న వైసీపీ
  • పరిష్కారానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారన్న బొత్స 
శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలను ఎందుకు ఆపేశారు? అంటూ సభలో టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైవ్ ప్రసారాలు ప్రారంభించాకే చర్చ ప్రారంభిద్దామని పట్టుట్టారు. ప్రత్యక్ష ప్రసారాలపై వైసీపీ తీరును నిలదీస్తున్నారు. వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు మూడు సవరణలను ప్రతిపాదిద్దామని టీడీపీ భావిస్తోంది

సాంకేతిక సమస్య తలెత్తిందని, పరిష్కారానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారని, గంట సేపట్లో తిరిగి ప్రసారాలు ప్రారంభం అవుతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యాంగ సంక్షోభం వచ్చినట్లుగా టీడీపీ రాద్ధాంతం చేస్తోందని పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు.
Telugudesam
YSRCP
Andhra Pradesh
Amaravati

More Telugu News