Amaravati: రాజధాని తరలింపుపై మనస్తాపం.. ఆగిన మరో రైతు గుండె!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో రైతు మృతి చెందాడు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత నెల రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల ఇవి మరింత ఉద్ధృతమయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో మనస్తాపం చెందిన కొందరు రైతులు గుండెపోటుతో మరణించారు. తాజాగా రాజధాని ప్రాంతానికి చెందిన మరో రైతు మృతి చెందాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన కొమ్మినేని పిచ్చయ్య (72) ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Go Back to Shorts
Amaravati
Andhra Pradesh
Farmer

More Telugu News