Congress: రాజధాని మార్చాలనుకుంటే తాజాగా ఎన్నికలకు వెళ్లాలి: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

  • ఎన్నికల్లో గెలిస్తే..జగన్ రాజధాని మార్చుకోవచ్చు
  • శాసన మండలి పునర్నిర్మాణ బిల్లు వైఎస్సార్ తెచ్చారు
  • మండలి రద్దు యోచన వైఎస్సార్ ను వెన్నుపోటు పొడవడమే

రాజధాని మార్పుపై జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తూర్పారబట్టారు. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసుకోవడాన్ని ఆయన ఆక్షేపించారు. రాజధాని మార్చాలనుకుంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ ను సవాల్ చేశారు.

ఎన్నికల్లో గెలిస్తే రాజధాని మార్చుకోవచ్చని చెప్పారు. మగాడిలా అసెంబ్లీ రద్దు చేస్తారో.. మోసగాడిలా మిగిలిపోతారో జగన్ తేల్చుకోవాలన్నారు. శాసన మండలి పునర్నిర్మాణ బిల్లును వైఎస్సార్ తీసుకువస్తే.. దాని రద్దుకు బిల్లును జగన్ తెస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు. మండలి రద్దు యోచన వైఎస్సార్ ను వెన్నుపోటు పొడవడమేనని ఆయన చెప్పారు.

More Telugu News