Vijayawada: జగన్ సర్కారు అనూహ్య నిర్ణయం... రిపబ్లిక్ వేడుకలు విజయవాడలోనే!

  • తొలుత విశాఖలో వేడుకలు జరుగుతాయని ప్రచారం
  • రిహార్సల్స్ కూడా చేసిన స్థానిక విద్యార్థులు
  • అకస్మాత్తుగా నిర్ణయాన్ని మార్చుకున్న సర్కారు
ఆంధ్రప్రదేశ్ గణతంత్ర వేడుకల వేదిక మారింది. తొలుత విశాఖపట్నంలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్ సర్కారు, నేడు అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. విజయవాడలోనే ఈ వేడుకలు జరుగుతాయని, అందుకు ఏర్పాట్లు చేయాలని కొద్దిసేపటి క్రితం మునిసిపల్ అధికారులకు ఆదేశాలు అందాయి.

విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశాలు అందడంతో, అధికారులు హుటాహుటిన స్టేడియంకు చేరుకున్నారు. కాగా, విశాఖలో ఇప్పటికే రిపబ్లిక్ వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక పాఠశాలల విద్యార్థుల రిహార్సల్స్ కూడా జరిగిన తరువాత వేదికను మార్చడం గమనార్హం.
Vijayawada
Vizag
Republic Day
Municipal Stadium

More Telugu News