Rajinikanth: క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు: రజనీకాంత్

  • పెరియార్ పై రజనీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ పత్రికలో కథనం
  • క్షమాపణలు చెప్పాలని ద్రావిడర్ విడుదలై కజగం డిమాండ్
  • తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న రజనీ
ద్రవిడ పితామహుడు పెరియార్ ను ఉద్దేశించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం తమిళనాడులో కలకలం రేపుతోంది. 1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీలో నగ్నంగా వున్న సీతారాముల విగ్రహాలను పెరియార్ తీసుకెళ్లారంటూ రజనీ వ్యాఖ్యానించినట్టుగా సదరు పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై ద్రావిడర్ విడుదలై కజగం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో రజనీపై ఫిర్యాదులు చేశారు. రజనీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో రజనీకాంత్ స్పందించారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను చేయని వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని... క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని అన్నారు.
Rajinikanth
Periyar
Dravidar Viduthulai Kazhagam
Kollywood

More Telugu News