పార్టీ కార్యాలయం గేటువద్దే.. పవన్ ను అడ్డుకున్న పోలీసులు
- రాజధాని గ్రామాల పర్యటనకు బయలుదేరిన పవన్
- అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- భారీగా మోహరించిన పోలీసులు
పార్టీ కార్యాలయానికి భారీ సంఖ్యలో పోలీసులు రావడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహిస్తూ, వారిని అడ్డుకున్నారు. కాగా పవన్ ఎర్రబాలెం, పెనుమాక, మందడం గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.