Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • ట్రేడింగ్ చివరి వరకు నష్టాల్లోనే పయనం
  • 416 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 127 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ రోజు ట్రేడింగ్ లాభాల్లోనే ప్రారంభమైనప్పటికీ క్షణాల వ్యవధిలోనే నష్టాల్లోకి జారుకుంది. ట్రేడింగ్ చివరి వరకు పలు షేర్లు పతనమవుతూనే వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ స్టాకులు ఎక్కువ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 416 పాయింట్లు కోల్పోయి 41,528కి పడిపోయింది. నిఫ్టీ 127 పాయింట్లు నష్టపోయి 12,224 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.09%), భారతి ఎయిర్ టెల్ (1.38%), ఐటీసీ (1.02%), ఏసియన్ పెయింట్స్ (0.82%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.65%).  

టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-4.76%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.08%), ఎన్టీపీసీ (-2.06%), టీసీఎస్ (-1.96%), యాక్సిస్ బ్యాంక్ (-1.76%).

More Telugu News